ఒంటరి.....
అందమైన లోకం చూస్తూఆదమరచి పోయాను
అందరాని ఆశల కోసం
అడుగులు వేసాను
అందులోని అపాయాన్ని
గమనించలేక పోయాను
కలల్లోన అడుగేసాక
కాలాన్నే మరిచాను
క్షణమ్ ఇంక తీరిక లేక
లోలోనే మురిసాను
నా కలే కల్లలై నేడు
కన్నీరైపోతుంటే
కడలి ముందు కాలం గడిపే
తీరాన్నే చేరాను
తిరిగి రాని కాలం వైపే
ఎదురు చూస్తూ
తరిగిపోతున్న సమయాన్ని
వదిలివేస్తూ...మిగిలిపోయాను
మొదలైన చోటనే...
ఒంటరిగా
కదిలే ప్రపంచపు
కాలాన్ని జయించని
ప్రతి మనిషి ఒంటరే
ప్రతి అడుగు వింతదే...!
No comments:
Post a Comment