మీరు పంపే ప్రతీ SMS కు 2 పైసల వంతున సంపాదించి మీ మొబైల్ రీఛార్జి కు నెలకు రూ. 50 వరకూ సంపాదించవచ్చు. అంతే కాక రోజుకు 25 ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. సరైన సమాధానానికి 2 పైసలు, ప్రతి తప్పు సమాధానానికి ఒక పైసా వంతున సంపాదించండి. మీ మిత్రులను invite చేసి ఒక్కో మిత్రునికి రూ. 1 వంతున సంపాదించండి. ఇవన్నీ చేయడానికి మీరు చేయవలసిందల్లా క్రింది కనిపించే లింక్ పై క్లిక్ చేసి మీ వివరాలు ఇవ్వడమే

Now Free Recharge

Showing posts with label అన్నీ తానే. Show all posts
Showing posts with label అన్నీ తానే. Show all posts

Saturday, 9 July 2011

అన్నీ తానే

అన్నీ తానే
ఓ చోట ఉండేది కాదు
ఏ గుండెకూ సొంతం కాదు
ఓ పూట పుట్టేది కాదు
ఏ పూవుకూ సరి తూగదు
లోకమంతా తానై ఉంటూ
ప్రతి గుండెలోనూ వికసిస్తూ
బ్రతికుండగానే వాడిపోతూ
ఆ వాసనతోనే మరు ఎదలో
కొత్తగా చిగురు తొడుగుతూ
తన కళ్ళతో లోకాన్ని అందంగా
చూపిస్తూ తను మాత్రం
అంధకారంలో దాక్కుంటూ
జననం లేని ఎదకు
మరణం తెలిసేలా గమనం
లేని తనకు గమ్యం చేర్చేలా
గతించిన జ్ఞాపకాల
ఒడిలో ఆడించేస్తూ తపించే రెండు
హృదయాలను ఒకటిగా చేస్తూ
అంతలోనే ఇక చాలని
ఎడబాటు చూపిస్తూ
చివరంట నడిచేది
ఈ ప్రేమే... చితి మంటై కాల్చేదీ...
ఆ ప్రేమే...
                                                                                                     మీ....నిర్మల్ రాజు