మీరు పంపే ప్రతీ SMS కు 2 పైసల వంతున సంపాదించి మీ మొబైల్ రీఛార్జి కు నెలకు రూ. 50 వరకూ సంపాదించవచ్చు. అంతే కాక రోజుకు 25 ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. సరైన సమాధానానికి 2 పైసలు, ప్రతి తప్పు సమాధానానికి ఒక పైసా వంతున సంపాదించండి. మీ మిత్రులను invite చేసి ఒక్కో మిత్రునికి రూ. 1 వంతున సంపాదించండి. ఇవన్నీ చేయడానికి మీరు చేయవలసిందల్లా క్రింది కనిపించే లింక్ పై క్లిక్ చేసి మీ వివరాలు ఇవ్వడమే

Now Free Recharge

Showing posts with label లోలోపల... ఏదో. Show all posts
Showing posts with label లోలోపల... ఏదో. Show all posts

Saturday, 9 July 2011

లోలోపల... ఏదో

లోలోపల... ఏదో
అందరూ అదమరిచి నిద్రిస్తున్నవేళ
పెట్రోల్‌ అంటుకుని గుప్పున మండుతున్నట్టు...
ఒక గగుర్పాటు
చటుక్కున ఒక మెలకువ..ఇక నిద్రరాదు
సాయంసంధ్యవేళ చింతచెట్టునిండా అల్లుకునే పక్షులగోల
అంతా చిందర వందర.. అంతా నిప్పు రవ్వల ముసురు
లోపల ఎక్కడో ఏదో దహించబడ్తోంది
ఇంకా ఎక్కడో లోలోపల అడవులు తగలబడిపోతున్నాయి
ఉవ్వెత్తున లేస్తున్న కెరటాలు గుండెలపై తలలు బాదుకుంటూ
ఎక్కడో..ఏదో మెలమెల్లగా ఘనీభవిస్తోంది.
నిజానికి మనిషి కరగాలి.. ద్రవించాలి..ప్రవహించాలి గదా
కాని..ఈ బొడిపెలు బొడిపెలుగా.. రాళ్ళు రాళ్ళుగా
హృదయం శిలగా మారుతూండడమేమిటి-
టీవీ భయపెడ్తూండడం జ్ఞాపకమొస్తుంది.
వార్తాఛానల్‌ ఏదిపెట్టినా.. కుక్కల గుంపుల కొట్లాట..ఒకటే మొరుగుడు
ఇనుప బూట్ల పదఘట్టనలకింద రక్తాలోడ్తూ మనిషి గుండెలు
అన్నీ అబద్ధాలు.. అన్నీ దబాయింపులు.. అంతా నిస్సిగ్గు వ్యభిచారం
గుండు సూదిని గుచ్చగానే బెలూన్‌ ప్రేలిపోవడం..అన్నీ ప్రేలాపనలు
ఒకటే ఉక్కపోత.. చెమట..చెమట కంపు.. కంపు మూసీనది
పట్టాలపై చక్రాలు కదలవు.. ఇంజన్‌నెడ్తోంది.. కాని ఏదో స్తబ్దించింది
అటు ఆ చేయిని లాగు.. ఇటు ఈ చేయిని లాగు
మధ్యలో.. ఒక లోలకం అంబరావధుల మధ్య డోలనం
ఎవడి మీట ఎక్కడుందో తెలియదు
ఎవడి కాంట్రాక్ట్‌ ఏ రాష్ర్టంలో బంగారు గుడ్లు పెడ్తోందో తెలియదు
ఢిల్లీ వీధులన్నీ కుట్రలతో నిండి నిండి.,
అంతా గార్బేజ్‌.. నో వేకెన్సీ.
‘ఇచట దొంగలందరూ రక్షించబడెదరు..రండి రండి బాహువుల్లోకి’
అరే వారీ..టివీలంటే..రాజకీయాలూ, సినిమాలూ..కండోమ్‌ల కంపేనా
తలలు వేలువ్రక్కలై..శతసహస్రాంశపేలికలుగా మనిషి ధ్వంసమౌతున్నవేళ
ఎవనిపై ఎవనికి నియంత్రణలేని రాక్షసమేళలో
స్వతంత్రానికీ విశృంఖలత్వానికి తేడా..ఒక ఒట్టి సన్ననిగీతఒంటిపై బట్టలుండుట..లేకపోవుట.. అంతే
నిద్రకూ, మరణానికీ తేడా..,
అప్పుడప్పుడు మేల్కొనుట..మేల్కొనపోవుట.. అంతే,
...లోపల ఎక్కడో ఏదో మరణిస్తున్నట్టనిపిస్తోంది
పటపటా తాళ్ళు తెగిపోతూ..
ఏదో కూలిపోతున్న నిశ్శబ్ద ధ్వని
..నిద్రరావడంలేదు..
దుఃఖమొస్తోంది..
ఎందుకో-   
                                      మీ...నిర్మల్ రాజు