మీరు పంపే ప్రతీ SMS కు 2 పైసల వంతున సంపాదించి మీ మొబైల్ రీఛార్జి కు నెలకు రూ. 50 వరకూ సంపాదించవచ్చు. అంతే కాక రోజుకు 25 ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. సరైన సమాధానానికి 2 పైసలు, ప్రతి తప్పు సమాధానానికి ఒక పైసా వంతున సంపాదించండి. మీ మిత్రులను invite చేసి ఒక్కో మిత్రునికి రూ. 1 వంతున సంపాదించండి. ఇవన్నీ చేయడానికి మీరు చేయవలసిందల్లా క్రింది కనిపించే లింక్ పై క్లిక్ చేసి మీ వివరాలు ఇవ్వడమే

Now Free Recharge

Saturday, 9 July 2011

మనస్సు చెట్టు

మనస్సు చెట్టు
మనస్సు బాటసారి కొన్ని క్షణాల చూపుల్లోనే
ఎన్నో వేల మైళ్ళు ప్రయాణించి వస్తాడు.
బతుకుతున్న మనిషికి మనసొక్కటే తోడు నీడై
అవి దృశ్యాలై ఆవిష్కరించబడేది.

అటు హిమాలయ పర్వతాల ఎత్తుల్ని
పసిఫిక్‌ మహా సముద్రపు లోతుల్ని
ప్రపంచంలోని పాత జ్ఞాపక స్నేహాల్ని
కోప తాపావేశాల్ని ఫిల్మ్‌ రీల్‌లా
తిప్పుతుంది.
తియ్యని మధుర మిఠాయి జ్ఞాపకాల్ని
నెమరు వేయిస్తుంది
బాల్యం నాటి ఇంద్ర ధనస్సుల తోరణాలు
కలలై అలలై కళ్ళముందు
కదలాడిస్తుంది.

మనిషిలో ప్రాణధార ఉన్నంత వరకు
నీ మనస్సు పక్షే నీలో ఆత్మ సాక్షి నివాసిని.
చిరకాల ఆకాంక్షలన్నింటిని
అభిరుచులన్నింటిని ముల్లె కట్టి
దాచిపెడుతుంది.
మనస్సు పెద్ద భాండాగారం
మనస్సు అంతుదొరకని
పెద్ద అగాథ ం.
మనస్సు ఆహ్లాద వేడుకలలో
తియ్యని కలల్ని తినిపిస్తుంది.
మనస్సు చెట్టుకు దుఃఖపు తీగలు
అల్లి బిల్లిగా అల్లుకుంటూనే ఉన్నాయ్‌.
సంతోషపు తీగలు మనస్సు పందిరిని
పెనవేసుకుంటాయ్‌.
మనస్సు చెట్టును కోప తాపాలకు
తావు లేకుండా
సదా నిర్మలంగా ప్రవహించే
నదిని చేయాలి.
నిర్మల గంగా తరంగం చేయాలి
ప్రశాంత సముదాయాన్ని చేయాలి!
మనస్సు చెట్టు
అనేకానేక అనుభూతుల ఖజానా
మనస్సు చెట్టు కుట్రల కుహకాలకు ఆవాలం
సర్వస్వాలకు కేంద్రం మనస్సు చెట్టు
పెనవేతలకు జోవన శోధన నాళికలకు
భవిష్యత్తు అంచనాలకు
నేటి బతుకు తెరువులకు
గతం యాదులకు పునాది
మనస్సు చెట్టు నిన్నటినుంచి
నేటి దాకా, రేపటి దాకా
పచ్చని పొలంలా
ఆనంద తాండవం చేసే పరమ శివుణ్ణి
చెయ్యాలి.
పచ్చ పచ్చని నవ్వుల పంటను
మనస్సు గాదెల్లో రేపటికి
దాచాలి
మనస్సు చెట్టు అన్నింటికి సర్వ సాక్షి సుమా!

No comments:

Post a Comment