నా ప్రియ సతి...
అలలను తాకే పున్నమి వెన్నెల వెలుగులులేత ఆకుల మీద నుండి జారే స్వాతి చినుకులు
పుష్పాల మకరందానిని గ్రోలే తేనీగలు
"నిన్ను ప్రేమిస్తున్నాను" అని రోజు నీవు అనే తియ్యని పలుకులు!
సుఘన్ధ పుష్పాల నుంచి వచ్చే పరిమళాల ల
రోహిణి కార్తె ఎండలను మరపించే విరహ తాపాల ల
కొమ్మ కొమ్మ కు వుయ్యలులు ఊగే మంచు బిందువుల ల
నీ "అధరామృతాన్ని" గ్రోలిన ప్రతిసారి అనిపిస్తుంది నాకు ఇలా !
కణకణ మండే కొలిమిలోని మంటలు
తళుక్కున మెరిసే తారలు
భరించలేని భావోద్రేకాలు
కలిగిస్తాయి నాకు నీ "క్రీగంటి చూపులు" !
నిత్య నూతనంగా విలసిల్లేది మన "వివాహం"
నీ మీద నాకున్న ప్రేమకు లేదు "కొలమానం "
మనిద్దరి ప్రేమ జీవితాలకు లేదు "హద్దు"
అంతంలేని నా ప్రేమకు ఇదే నీకు నేనిస్తున్న తీయని "ముద్దు"
No comments:
Post a Comment