మీరు పంపే ప్రతీ SMS కు 2 పైసల వంతున సంపాదించి మీ మొబైల్ రీఛార్జి కు నెలకు రూ. 50 వరకూ సంపాదించవచ్చు. అంతే కాక రోజుకు 25 ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. సరైన సమాధానానికి 2 పైసలు, ప్రతి తప్పు సమాధానానికి ఒక పైసా వంతున సంపాదించండి. మీ మిత్రులను invite చేసి ఒక్కో మిత్రునికి రూ. 1 వంతున సంపాదించండి. ఇవన్నీ చేయడానికి మీరు చేయవలసిందల్లా క్రింది కనిపించే లింక్ పై క్లిక్ చేసి మీ వివరాలు ఇవ్వడమే

Now Free Recharge

Saturday, 9 July 2011

రెండు జీవితాలు

రెండు జీవితాలు
కొన్నిసార్లు భలే మాట్లాడతాము
వాక్యమొక విషయం చెబుతుంది,
పదాలు మరొకటి చెబుతాయి

సంభాషణ ఒక సంగతి వివరిస్తుంది,
ఉచ్ఛారణ మరేవో గుసగుస లాడుతుంది

కొన్నిసార్లు భలే పనులు చేస్తాము
పని ఒకదారిన కనబడుతుంది,
ఫలితం మరోదారి చూస్తుంది

కొన్నిసార్లు మనం వింతగా ఉంటాము
ముందు ఒకందుకు నవ్వుతాము,
వెనుక మరొకందుకు నవ్వుకుంటాము

పైకి ఒకందుకు ఏడుస్తాము,
లోపల మరొకందుకు రోదిస్తాము

చాలాసార్లు మనం
రెండు జీవితాలు జీవిస్తాము
మనల్ని రెండు చేసుకుని,
రెండు సగాలు కోల్పోతాము
ఎంతకూ నిండని రెండు సగాలలో
అర్థంలేని విషయాల సున్నాలు నింపుతాము

ఎప్పుడైనా అరుదుగా
ఒక పసివాడి నవ్వో,
పూల వికాసమో,
పక్షుల ప్రవాహమో
మనని కాసేపు ఒకటి చేసి,
మనని మనతో నింపి దీవించి వెళతాయి

ఎప్పుడైనా అరుదుగా
మనం ఏమరపాటున దయగా,
నిజాయితీగా ఉన్న క్షణాలు,
నిండైన క్షణాలు
మనకు ఇంత శాంతిని ప్రసాదిస్తాయి,
మనల్ని సారవంతం చేసి మాయమౌతాయి.

No comments:

Post a Comment