చీకిటి మనసు
పరమాత్మ ఆత్మలో లీనమయిన తర్వాతమనసు ఒంటరిదయిపోయింది
మనసుకు దేవుడంటే భయమే;
మనసు భయం మనిషిని వెన్నాడుతున్నప్పుడు
చెట్టుకు పుట్టకు మొక్కుతాడు
రక్షించుమని- పాపాలకు శిక్ష వద్దని-
వ్యవస్థలో రక్షణ ఓ సమస్యగా మారింది.
ప్రపంచీకరణ మనిషిని వెన్నాడుతున్న
భూతంలా ఉంది
అంతా దేవుడి పేరుతో జరుగుతున్న అన్యాయమే!
పెద్ద కుట్ర ఎక్కడ ప్రారంభమయ్యిందో
చెమట కేం తెల్సు
శ్రమకు విలువ లేని కాలమొచ్చిందనే
దుఃఖం
అంతా దళారీతనం
భక్తి భయంతో ముడి వేసుకొన్నప్పుడు
మనసు బ్రేక్ లేని వాహనం ఎలా పడిపోతుందో ఏ యాక్సిడెంట్‌లో
ఏ అవయవం నేల రాలుతుందో
తెలియని గాయం
మనసు ప్రపంచీకరణ చౌరస్తాలో నిల్చొని
మెరుపు లేని ఆకాశం వైపు
నిశ్శబ్ద చూపు
No comments:
Post a Comment