నా ప్రేమ.....?
నిండుగ నా మదిలో నువ్వే కొలువున్నా
నిత్యం నిన్ను చూసేందుకై
నే ఆరాటపడుతున్నా
నింగిలో నాకందని
తారకవని తెలిసున్నా
నీ జాడని కోరే నీడనై
నింగికి నిచ్చెన వేస్తున్నా
నిన్నటి నా కలవై
నువ్వు చేదిరిపోతున్నా
నేటికీ నే శిలగానే
వేచి చూస్తున్నా
మానని గాయమై నా
యదను చీల్చివేస్తున్నా
వాడని పూవుగా నీకై
ఎప్పటికి ఎదురు చూస్తూ
ఉండేదే........ నా ప్రేమ
నీ ప్రేమే లేనినాడు
కడతేరిపోదా నా జన్మ
No comments:
Post a Comment