మీరు పంపే ప్రతీ SMS కు 2 పైసల వంతున సంపాదించి మీ మొబైల్ రీఛార్జి కు నెలకు రూ. 50 వరకూ సంపాదించవచ్చు. అంతే కాక రోజుకు 25 ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. సరైన సమాధానానికి 2 పైసలు, ప్రతి తప్పు సమాధానానికి ఒక పైసా వంతున సంపాదించండి. మీ మిత్రులను invite చేసి ఒక్కో మిత్రునికి రూ. 1 వంతున సంపాదించండి. ఇవన్నీ చేయడానికి మీరు చేయవలసిందల్లా క్రింది కనిపించే లింక్ పై క్లిక్ చేసి మీ వివరాలు ఇవ్వడమే

Now Free Recharge

Tuesday, 12 July 2011

అమ్మా! అమ్మా!

అమ్మా! అమ్మా!


కళ్ళకింద బావులేర్పడతాయి
మొగ్గల్లా ముఖంమీదకి పొడుచుకొచ్చి విప్పారిన కళ్ళు
ఇప్పుడు బావిలో పడిపోయిన మట్టిముంతలు
సూర్యోదయం మీద లేతతమలపాకులా నవనవలాడిన
ముఖం నేడు అనూహ్యాఅకాల జీర్ణపత్రం
ఒకప్పుడు అన్ని కాలాలూ మిళితమై
ఆమె ముఖంలో లాస్యం చేసేవి

అప్పుడామెకి చిగిరించట మొక్కటే తెలుసు
సారవంతభూమిలా పరిమళించేది, విత్తనమే కాదు
వేలుబెట్టినా మెలకెత్తుతుందోమోనని భయంవేసేది
ఉదయంపూట అలా కొండలమీంచి ఉద్యానవనాల మీంచి
కదిలొచ్చే నీలిమేఘాల గుంపును చేస్తే
తెలిసేది ఆమంటే ఏమిటో –
కాలికింద కదిలిపోయే రోడ్డు కానీ
చేయి కింద జారిపోయే నీళ్ళుకానీ
ఒక ఉన్నత్త ఆనందపారవశ్యంతో స్వర్గారోహణకన్నట్టు
కదునుతొక్కేవి -
ప్రపంచం ఇక అద్భుతపక్షై తన చుట్టూ తిరిగేది
పగటి ఎండలూ వెన్నెల రాత్రిళ్ళూ కలగలసి ఒక వినూత్న
కాంతిగా మారి ఆమె అనే లోయంతా పర్చుకునేవి
వేనవేలుగా చిన్నపిల్లలనే తోటలన్నీ ఆమెనిండా దరహసించేవి
ఏ గుడివద్దో, మజీదువద్దో ఒక్కసారిగా లేచిన పావురాల
గుంపులన్నీ ఆమె కళ్ళల్లో కదలాడేవి -
తెల్లవారు ఝామున నాలుగ్గంటల మహానగరంలా ఉండేది
కాలువకట్టమీదుగా పరుగెత్తే టెలుఫోను తీగలా నిత్యం
విచిత్రనాదం చేసేది -
అన్ని పొద్దుటిపూటల అన్ని సాయంకాలాల
నిర్మలానందోత్సాహాల జలతరంగిణి ఆమె -
ఇప్పుడేముంది
మధ్యబిందువు నుంచి అన్నివైపులకి అనేకముఖాలుగా
చీలిపోయి వాసనా, రుచిలేని ఒకానొక విచిత్ర ముకురపుష్పం
ఎన్నాళ్ళకిందో గోడమీద రాయబడి లీలగా ఛాయ మాత్రమే
మిగిలిపోయిన ఉద్రేకపూరిత గొప్ప పోరాట నినాదం -
పోయే రైలు అద్దంలోంచి చూస్తే వెనక్కి మరీ మరీ వెనక్కి
జరిగిపోయే అనేక గ్రామాల అస్పష్ట అమాయకపు రూపు రేఖ
ఎప్పుడో ఏ నక్షత్రం నుంచో బయల్దేరిన కిరణం భూమిని చేరక
అలానే మార్గమధ్యంలో నిలచిపోయినట్లు –
ఇప్పుడు ఖాలీకుండీలు మాత్రమే మిగిలిన ఒక్కప్పటి అద్భుతమైన
మృదులాంకుర తరళ సౌందర్యరాశి గొప్ప నర్సరీ –
చల్లనీ నీటిగాలిలా ప్రసరించిన తల్లి, పరవశింపచేసిన తల్లి,
నేడు విస్తీర్ణ యిసుకసముద్రాల సామ్రాజ్యం –
పైకప్పు కూల్తుంటే –
వాకిళ్ళూ, కిటికీలూ పీక్కెళ్ళిన శూన్యనేత్రాల గృహం
ఆ పక్కా ఈ పక్కా తెగొట్టబడి, విసర్జించబడిన రోడ్డు –
ఆమెకందరూ ఉన్నారు, తల్లిదండ్రులూ, బంధుకోటి, భర్తపిల్లలూ -
ఎందరున్నా ఏకాకిగా మిగిలిపోతున్న ఈ దేశం ఆడది ఆమె
అందరి జన్మలకూ అభివృద్దికీ కారణభూతమైన ఆమె ఆమెగానే
మిగిలిపోతుంది
అందరి అవసరాలు తీర్చుతూ ఎవ్వరికీ చెందనీ ఆదిమతల్లి
యుగయుగాల పవిత్ర దాసి –
లోతు తెలియని శారీరకశ్రమల మానసిక సంక్షోభాల సంకీర్ణ మాహాటవీ!
నా మొత్తం శరీరాన్ని రెండు చేతులుగా మార్చి
నమస్కరిస్తున్నాను తల్లీ!
సమస్త ప్రపంచాన్నీ నీ అరచేతుల్లోకి తీసుకుని చాచి
ఒక్కలెంపకాయ కొట్టు తల్లీ –
అఖిల పురుష ప్రపంచాన్ని నీలో తన వికృతపుటాకారాన్ని
దర్శించనీ – దర్శించనీ.

No comments:

Post a Comment