ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ పోరాటమే బతుకు తెరువు పోరాటం.” ప్రొఫెసరు.కోదండరాం తో సామాజిక ఇంటర్వూ
| తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ప్రముఖ నాయకుడు, పొలిటికల్ సైన్స్ ప్రొఫెసరు, ఒకప్పటి మానవహక్కుల ఉద్యమ నాయకుడు ప్రొఫెసరు. కోదండరాం తో ప్రజాకళ సామాజిక ఇంటర్వూ: |
- గుర్రం సీతారాములు
మొదటి భాగం:రెండవ భాగం:
మూడవ భాగం:
నాలుగవ భాగం:
( సాహితీ మిత్రులు విప్లవ్, దిలీప్ ఇంటర్వూ-ఆడియోను అక్షర రూపంలోకి మార్చారు. )
ప్ర. ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు కోరుకుంటున్నారు?
జ. ఈ తెలంగాణ పోరాటమనేటిది బ్రతుకు తెరువు కోసం. బతుకుదరువుకోసం సాగుతున్నటువంటి పోరాటం. వాళ్ళ చేతి వృత్తులు చితికిపోయి, వ్యవసాయం నాశనమై పోయి, చదువుకున్న యువకులకు కావలసిన ఉద్యోగాలు దొరకక ఈ మొత్తం దీనికి కారణం, తెలంగాణా (ప్రాంతం) ఆంధ్ర ఆధిపత్యంలో ఉండటమేనని ప్రజలు అనుకుంటున్నారు. అందుకనే ఇవ్వళ తెలంగాణ రాష్ట్ర ఉద్యమమనేది ఈ సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చింది. ఎన్నకల్లో ఎంతసేపటికి,సంక్షేమ పథకాలు ఇస్తమనే తప్ప కని బ్రతుకు తెరువు సమస్యలకు పరిష్కారాన్ని చూపలేదు. కమ్యూనిస్టు పార్టీలు కూడ CPI, CPM లాంటివి ఈ సమస్యల ప్రస్తావన తీసుకొచ్చినప్పటికి, వాటికి ఒక పరిష్కారాన్ని ముందుకు తెచ్చి, కనీసం ఎన్నకల్లోనైన దాన్ని ఒక ప్రధాన అంశంగా ఎజండామీదికి తెచ్చే ప్రయత్నమూ చేయలేదు. ఇక పర్లమెంటరీ వ్యవస్థకు వెలుపల ఉన్న కమ్యూనిస్టు పార్టీలు కూడ బలహీన పడ్డయి. అవి కూడ ఈ సమస్యల పర్ష్కారన్ని చూపగలిగే ఒక సైద్ధాంతిక చట్రాన్ని పెంపొందింప లేకపోయింది. ఈ నేపధ్యంలో తెలంగాణ ఏర్పడితేనే ఈ సమస్యలు పరిష్కారమైతయనేది గత పది సంవత్సరాల చర్చా క్రమంలో ప్రజలకు ఒక అవగాహన ఏర్పడ్డది. ఆ అవగాహనకు లోబడే ఇవ్వళ వీళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నరు. తెలంగాణ రాష్ట్రమనేది బ్రతుకు తెరువు సమస్యలకు పరిష్కారం చూపుతది అనేది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ పోరాటమే బతుకు తెరువు పోరాటం.
ప్ర. ప్రత్యేక తెలంగాణకోసం కావలసిన రాజకీయ కర్యక్రమం ఉద్యమ స్వరూపమేమిటి?
జ. ప్రత్యేక తెలంగాణకొరకు కావలసిన రాజకీయ కార్యక్రమం ఏమిటంటె ఒక రాజకీయ కార్యక్రమం రూపొందించుకోవటం. ఆంధ్రా ఆధిపత్యం రూపొందటానికి ఇక్కడి రాజకీయ నాయకత్వమే మూల కారణం. ఆంధ్ర సంపన్న వర్గాలకు తెలంగాణ ఒక అంతర్గత వలస. దోచుకోవటానికి తోడ్పడుతున్నది. అందుకనే ఆ వర్గాల ప్రజలు ఇవ్వళ తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటున్నరు. కాని వాళ్ళకు పూర్తిగా సహకరిస్తున్నటువంటిది ఇక్కడి రాజకీయనాయకులే. ఈ రాజకీయ నాయకత్వమే వాళ్ళు ఇక్కడ దోచుకోవటానికి దారి వేస్తున్నది. వాళ్ళ ఆధిపత్యానికి ఇక్కడ ఊతంగ నిలుస్తున్నది. కనుక ఇవ్వాళ తెలంగాణ రాజకీయ నయకత్వమనేది వేరైతున్నది. తెలంగాణ ఆకాంఖలను వ్యక్తీకరించే నాయకత్వం రూపొందగలిగినప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రమనేది ఏర్పడుతది. ఆంధ్ర ఆధిపత్యం కుప్పగూలి పోతది. అందుకనే ఇయ్యాళ తెలంగాణ ఉద్యమంలో ప్రధానమైన లక్ష్యమనేది ఏందంటె ఈ ఆకాంక్షలను వ్యక్తీకరించగల నాయకత్వాన్ని రూపొందించుకోవాలె.
ప్ర. ఉద్యమ స్వరూపమే అది అంటరు??
జ. ఉద్యమ స్వరూపమే అది. ఈ నాయకత్వాన్ని ఎదిరించటం, ఆంధ్ర సంపన్న వర్గాల దోపిడిని ఎదిరించటం. దానికి ప్రధాన అండ దండగా నిలుస్తున్నటువంటి ఇక్కడి రాజకీయ నాయకత్వాన్ని ఎదుర్కోవటం. ఏమేరకు ఈ రాజకీయనాయకత్వం ఆంధ్ర సంపన్న వర్గాలునుండి వేరు పడగలిగితే ఆ మేరకు స్వతంత్ర
.. కనుక తెలంగాణ ఆకాక్షలను వ్యక్తీకరించగల రాజకీయ నాయకత్వాన్ని రూపొందించుకోగలగటమే తెలంగాణ ఉద్యమానికి లక్ష్యంగా ఉంటదని, అది జరిగిన రోజు తెలంగాణ రాష్ట్రమేర్పడుతది.
ప్ర. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమంలో స్తబ్దత ఎందుకు వచ్చింది?
జ. స్తబ్దత అనేది పత్రికలు సృష్టించిందే. వాస్తవానికి కింద అది లేదు. ఇప్పుడు జరిగిందేందంటె, ఒక రూపాన్నించి ఇంకో రూపానికి ఉద్యమం మారుతది. ఇంతవరకు భావ వ్యాప్తి అనే పూర్తయింది. జనసమీకరణ దశ అనేది పూర్తయింది. అందుకు కావలసినటువంటి రూపాలమీద ప్రజలకు స్పష్టత ఉంది. దాని తదనంతరం అందరు అనుకున్నదేందంటె రాజకీయ నాయకులు రాజీనామా చేస్తరు. రాజకీయ సంక్షోభం ద్వార ఈ ఉద్యమమనేది ఇంకోదశ ముందుకు పోతది అని జెప్పి అందరు అనుకున్నరు. కాని ఆ రాజకీయనాయకత్వమనేది రాజీనామా చేయకపోవటం చేత ఇవ్వాళ ఉద్యమనేది ఏ రూపంల ఉంటదనేది మనమొక స్పష్టత ఇవ్వవలసి ఉంటది. ఆ స్పష్టత ఇవ్వటానికే మనం ప్రయత్నం చెయ్యాలె. ఆ స్పష్టత ఏర్పడితే మరొక దశ ఉధృతంగ ముందుకు పోతది. ప్రజలందరు సంఘటితం కావాలె. సంఘటితమై ఈ రాజకీయ నాయకత్వాన్ని ఎదిరించే దిశగా, దానికి కావలసిన ఉద్యమ రూపాలను ఎంచుకోవాలె. ఆ ఉద్యమ రూపాలను ఎంచుకునే దగ్గరనే ఇయ్యాళ మనకు సమస్యనేవి తలెత్తుతున్నయి. అక్కడ మనం స్పష్టత ఇయ్యగలిగితే మరొక్కసారి ఈ ఉద్యమనేది ముందుకు పోతది. అక్కడ మనం (అర్ధం చేసుకోవలసింది) ఇన్ని సమస్యలున్నా ఇప్పటికిదేం ఆగిపోలేదు. ఇక్కడ ప్రధానంగా రిలే నిరాహార దీక్షలు, ధూం ధాం లనేవి ప్రతి ఊళ్ళె జరుగుతున్నయి. ర్యాలీలు, బహిరంగ సభలు, ప్రతిచోట జరుగుతూనే ఉన్నయి. ఆ రూపంగ జరుగుతున్న కార్యక్రమాలకు మీడియాలో మొన్నటిదాక రాజకీయ నాయకులొచ్చిండ్రు కాబట్టి పబ్లిసిటీ ఉంది. ఇయాళ కాంగ్రేస్ తెలుగుదేశం నాయకుల్లేరు కాబట్టి కొంత మీడియా పబ్లిసిటీ లేదు కానీ, ఆ కార్యక్రమాలేం ఆగిపోలేదు.
ప్ర. ఆ కార్యక్రమాలు జరుగుత్న్నయి, ప్రజల దగ్గర అదేం లేదు. కాని పొలిటికల్ గా స్తబ్దత ఉంది?
జ. పొలిటికల్ గా స్తబ్దత ఎందుక్కున్నదీ అంటె, ఇప్పుడున్న ఈ రాజకీయ నాయకత్వాన్ని మనమెదుర్కోవాలె. ఎదుర్కోవాడానికి మన వ్యూహమేంది, అందులో మనం తీసుకునే ఎత్తుగడలేంది. రోజువారీ కార్యక్రమాలేంది అనేటివి మనం స్పష్టత ఇవ్వలేకపోతున్నం. ఆ స్పష్టత అనేది ఇవ్వగలిగితే నేనంకుకోవటం, మలుపు తిరిగి బలంగ ముందుకు పోతది.
ప్ర. ఉద్యమము శ్రీకృష్ణ కమిటీ ముసుగులో చిక్కుకున్నదా? కాలయాపన తప్ప కమిటీయొక్క ప్రయోజనమేమిటి?
జ. కమిటీ మీద జనాలకెవ్వరికి విశ్వాసం లేదు. కమిటీలతోటి తెలంగాణ రాదు. కమిటీలు కాలయాపనకే పనికొస్తయనేది ప్రతి ఒక్కళ్ళు అంటున్నరు. కాబట్టి తెలంగాన వాళ్ళెవరు కమిటీ వచ్చింది కాబట్టి ఉద్యమం ఇంగ కొంత కాలం ఆపుదామనే ఆలోచనలో ఎవ్వళ్ళేరు. కనుక కమిటీ వళ్ళ ఉద్యమమేం ఆగలే. కాకపోతె కొంతమంది కమిటీకు కూడ ఒక నివేదిక ఇద్దామని తయారీల ఉన్నరు. అదికూడ కొంతవరకు మేలైంది. ఎందుకంటె, కొన్ని వర్గాలు తమ సమస్యల మీద అధ్యయనం చేయగలిగినయి. మంచి నివేదికలు తయారు చేయగలిగినయి. కనుక రేపటి ఉద్యమానికి కావలసిన మందుగుండు సామాగ్రిని మొత్తంగ కూడ తయారు చేసుకోవటానికి ఈ ప్రయత్నాలు దోహదపడుతున్నయి అనేది నేననుకుంటున్న.
ప్ర. ఆర్ధిక నిర్బంధం అనేది ఈ ఉద్యమానికి ఎట్లా దోహదం చేస్తుంది?
జ. ఆర్ధిక నిర్బంధం తోటి మనకు కొన్ని రకాల ఇబ్బందులున్నయి. ఇప్పుడు ఇక్కడ పెట్టుబడిని మనం అర్ధం చేసుకోవాలి. ఈ పెట్టుబడి ఉత్పత్తి రంగం నుంచి వచ్చినటువంటి పెట్టుబడి కాదు. ఉత్పత్తి క్రమంల వచ్చింది కాదు. ఉదాహరణకు, టాటా ఒక స్టీల్ రంగంల ఉన్నడు. రిలయెన్స్ ఒక బట్టలు పెట్రోలియం ఉత్పత్తి రంగంల ఉన్నరు. ఇయ్యళ ఆంధ్రల కూడ తొలిదశల వచ్చినటువంటి పెట్టుబడి దారులందరు, ముళ్ళపూడి లాంటి వాళ్ళు, ఒక వ్యవసాయ అనుబంధ పరిశ్రమలల్ల వాళ్ళు పెట్టుబడులు పెట్టిండ్రు. ఇవ్వళ ఉన్నటువంటిది, ఇది ఒక లుంపెన్ క్యాపిటల్. ఈ లుంపెన్ క్యాపిటల్ అనెది రజ్యం మీద ఆధారపడి, కేటాయింపుల రూపంలో డబ్బులు సంపాయించే ప్రయత్నం చేస్తది. కనుక ఈ రంగము వీళ్ళు చేస్తున్నటువంటి ఉత్పత్తి అనేది చాలా తక్కువ. ఒకటీ రెండు రంగాలకు మాత్రమే పరిమితమైంది. కొంత ఫార్మా రంగము, తర్వాత సినిమా రంగం. సినిమా, కమ్యూనికేషన్స్. ఈ రెండు రంగాలకు వెలుపల వాళ్ళు నిజానికి ఉత్పత్తి రంగంలో ప్రవేశించిందే లేదు. అంటె పెట్టుపడికున్న జూదరి స్వభావం వల్ల బాయ్కాట్ అనేది మనము ఎట్ల చేస్తము అనెదని మీద మనమొక నిర్ణయానికి రాలేకపోతున్నం. ఈ జూదరి స్వభావం కలిగినటువంటి పెట్టుబడి ఉత్పత్తి లోకి రాదు. ఉత్పత్తి ద్వారా సంపాదించుకునేది చెయ్యదు. జూదరి స్వభావం కారణంగా ఇది ప్రధానంగా సేవారంగానికే పరిమితమైతది. ఈ సేవారంగానికే పరిమితమైనటువంటి పెట్టుబడి ప్రధానంగా చేస్తున్నటువంటి ఉత్పత్తులు సినిమాలు, టెలీ కమ్యూనికేషన్సే. ఈ రంగాల్లో మనమెదురుకోవాలంటే, మనం పూర్తిగా తయారు కావాలె. రెండో సమస్య, మనం చేసేటువంటి ఏ ప్రయత్నమైనా ఆంధ్రా సంపన్న వర్గాల వెనుకాల ఆంధ్రా ప్రజలను నెట్టేదిగా ఉండాలి. వాళ్ళ మధ్య వైరుధ్యం తలెత్తునది. వాళ్ళ మధ్య ఘర్షణ జరుగుతున్నది.. ఈ ఘర్షణ నేపధ్యంలో మనము సంపన్న వర్గాలు అక్కడి ప్రజలు సంఘటితపర్చుకునేటువంటి ఒక అవకాశాన్ని మనం కల్పించాలి. మూడోదేమంటె, కొన్ని రకాలైనటువంటి వస్తువులు, ఇక్కడ అమ్ముకునే డీలర్లు ఉన్నరు. వాళ్ళూ కూడ కొంత ఆధార పడి వున్నరు. కనుక వేలు మనదే కన్ను మనదే అన్నట్టు కాకుండ, ఆ వర్గాలక్కుడ నష్టం జరగకుండా చూసుకోవాలె. కనుక వీటిని దృష్టిల పెట్టుకుని, మనం కొన్ని రకాలైనటువంటి ఉత్పత్తులనెంచుకుంతె ంతప్పని సరిగా మంచి ఫలితముంటది. జాతియ మీడియానుంచి మనకొక మద్దతు వస్తది. స్థానికంగ ఉన్నటువంటి, తెలంగణ ఉత్పత్తులక్కూడ గిరాకీ వస్తది. ఒక్క అంశము, నాకు పదే పదే దృష్టిలకొస్తున్నదేమిటీ అంటె, ఈ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అంటె, బీరు బ్రాందీ, విస్కీ, వీటి లోకల్‌గా తయారీ కానీ, అమ్మేవాల్లు కానీ, డిల్లర్లు కానీ వీటిలో ఎక్కువ వరకు ఆంధ్ర సంపన్న వర్గాల వాళ్ళే ఉన్నరు. వీళ్ళు పెద్ద ఎత్తున తెలంగాణల ఈ లిక్కర్ అమ్ముతున్నరు. ఇది మామూలు బిజినెస్ కాదు. వేల కోట్ల రూపయలల్ల ఉన్నది. ఉత్తి గవర్నమెంటుకే ఇయ్యాళ మూణ్ణాలుగు వేల కోట్ల రూపాయలు సాలుసరీ ఆదాయం ఉన్నదంటె మీరూహించండి, ఏ నలభైవేలకోట్లో, యాభై వేలకోట్లో లిక్కర్ అమ్మకాలనేవి తెలంగాణలోనే జరుగుతున్నయి. అంత అమ్మకాలను మనం ఆపక్గలిగితే ఒక పెద్ద దెబ్బ కొట్టినట్టే. తెలంగాణ ఆర్ధిక వ్యవస్థ స్వరూపాన్ని కూడ మార్చినవాళ్ళమవుతం. మనం చెప్పొచ్చు, మీరు బీరు బ్రాందీ మానేయండి, మీ వూళ్ళె కల్లు తాగండి, తప్పు లేదు. ఎందుకంటె ఖర్చు తక్కువ, అందుల మందు కలపకుంట మనం జాగ్రత్త తీసుకుంటె వీళ్ళకు ఆదాయం తగ్గుతది. అది శరీర ఆరోగ్యానికి కూడ నష్టం చేసేటిది కాదు. అట్ల ప్రచారం చేస్తె మంచి స్పందన వస్తున్నది దానికి ప్రజల్లో కూడ, ఎందుకంటె ఇది విపరీతమైన ఆద్ర్హిక దోపిడీకి ఇది కారణమైతున్నది. ఇట్లాంటి అంశాలను మనం గుర్తించి — అదేవిధంగ సినిమాలను, సాంస్కృతిక దోపిడీగ మనం విస్తృతంగ గుర్తించగలిగితె, ఆ సినిమాకు పోతె వచ్చే ప్రయోజనమేం లేదు, నష్టం తప్ప. ఇప్పటికే ఫ్యాన్స్ అసోషియేషన్స్ పోయినయి. చాలావరకు సినిమా పరిశ్రమ ఒక సంఖోభంల చిక్కుకున్నది. సినిమాలు తీయాలా వద్దా, పెట్టుబడులు పెట్టాలా వద్దా అని వాళ్ళు కొట్టుమిట్టడుతున్నరు. కంక అట్లాంటి రూపాలను మనమాలోచించుకోవాల్సి ఉంటది. ఈ నిర్ణయాంకి వచ్చేముందు, మనం పెట్టుబడి స్వభావాన్ని చూడాలి. దానికి మన తెలంగాణ ప్రజానీకానికి ఉండే లింకు చూసుకోవాలి. మూడోది ముఖ్యమైన విషయం, దానివల్ల మనకు నష్టం జరగకుండా చూసుకోవాలె. ఈ జాగ్రత్తలు తీసుకోగలిగనప్పుడు, మన వ్యూహం తప్పనిసరిగా విజయవంతమైతది. ఇప్పటికీ మనక్కొంత అవగాహన ఏర్పడ్డది. కనుక తప్పనిసరిగా విజయవంతం కాగలుగుతం అనే విశ్వాసం ఏర్పడింది.
ప్ర. ప్రజాస్వామిక ఊద్యమాలను ప్రభుత్వాలసలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ క్రమంలో ఆర్ధిక దిగ్భంధనంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం యాభై శాతం తగ్గించగలిగితే పరిస్థితి ఎలా వుంటుంది.దాని వల్ల ప్రభుత్వం దారికొస్తుందని మీరనుకుంటున్నారా?
జ. ఇప్పటికే జరుగుతున్న ఉద్యమాల ఫలైతంగా రాష్ట ప్రభుత్వ ఆదాయమనేది గణనీయంగా పడిపోయింది. ఈ మొద్త్తం నేపధ్యంలో వాళ్ళే, ఈ వయవస్థను ఎట్ల నడపాలె అనే ఆలోచనతో ఉన్నరు. కనుక గవర్నమెంటు ఇప్పుడు ఉన్న ఆందోళనలు ఇట్లానే కొనసాగగలిగితే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడపటం కూడా చాలా కష్టం. ఒక వైపేమో ప్రభుత్వానికి ప్రజామోదం తగ్గిపోతుంది. మరోప్రక్క ప్రభుత్వానికి పన్ను, పన్నేతర పనీనేతర ఆదాయం పడిపోతుంది. చాలా స్పష్టంగా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల పట్ల వ్యతిరేకత పెరుగుతుంది. అందుకనే రాష్ట్ర పరిపాలననే ఒక సంక్షోభంల చిక్కూన్నది. తప్పనిసరిగ తెలంగాణ ఉద్యమం విజయం సాధిస్తది.
ప్ర తెలంగాణ ఉద్యమ నిర్మాణ ఎట్లా జరుగుతుంది? పల్లెల్లో గ్రామాల్లో కమిటీలు నిర్మాణత్వం అయినవా?
జ. నిజానికి, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఏర్పరచుకున్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ అనేది తొలి ఉద్య్మ నిర్మాణ రూపంగా ప్రజలముందుకు వచ్చింది. దాన్నే ప్రజలు ప్రతిచోట అనుకరించిండ్రు. అనుకరించి అన్ని సంఘాలు పార్టీలకు అతీతంగా ప్రతిచోట జాయింట్ యాక్షన్ కమిటీలు పెట్టుకున్నరు. గ్రామ స్థాయిల కులాలు కుల సంఘాల ఆష్వర్యంలోనే ప్రజలు సంఘటితమై ఉన్నరు కాబట్టి, ఆ సంఘాలే ప్రధానంగా భాగస్వామ్యం తీసుకుంటున్నయి. గ్రామాల్లో గాని, మండలాల్లో గాని. తరువాత గ్రామాల్లో మండలాల్లో సమన్వయమనేది ఉన్నది కాని, మండల స్థాయికి, జిల్లా స్థాయికి సమన్వయం లేదు. ఎందుకంటె గ్రామాల్లో ఆందోళన తీసుకుంటున్నప్పుడు ఆ ఆందోళన గ్రామాల్లో భాగస్వామ్యం లేకుండ చెయ్యలేరు. కాబట్టి గ్రామస్తులను వాళ్ళూ కలుపుకుని పోయినరు. కనుక ఒక రోజు ఒక కులం వాళ్ళూ వచ్చు ఆ దీక్ష శిబిరంల కూర్చుంటున్నరు. ఆ గ్రామంల తమకు కేటాయించిన ఒక కులంవాళ్ళు కూర్చుంటున్నరు. ఉదాహరణకు, ఒక రోజు, గొల్ల కురుమ కులథులు కూర్చోవాలని నిర్ణయం చేస్తె, ఆ కులానికి చెందిన వాళ్ళూ ఆ మండలం అన్ని గ్రామాలనించి వచ్చి అక్కడ కూర్చుంటరు. అట్లా గ్రామాలకు మండల కమిటీలకు మధ్య సమన్వయమనేటిది ఇప్పటికే ఉన్నది. అయితే మండలాలకు జిల్లాలకూ మధ్య ఆ సమన్వ్యయం లేదు. ఎందుకంటె ప్రతి జిల్లలో యాభై అరవై మండలాలు ఉన్నయి. ఇన్ని మండలాలను సమన్వయ పర్చుకోవటమనేది అంత మామూలు విషయమేం కాదు. దానికి తోడు రాజకీయ పార్టీలు వచ్చినప్పుడు, వాటిమధ్యన ఉన్న పోటీల కారణంగా కూడా ఒకటీ రెండు JACలేర్పడి ఉన్నయి కొన్ని కొన్ని చోట్ల. అట్ల డివైడ్ అయి ఉన్నచోట సమన్వయ పర్చుకోవాలంటె కూడ కొన్ని ప్రత్యేకమైన సమస్యలు ఉన్నయి. ఇప్పుడు వస్తున్న ఆలోచన ఏందంటె, గ్రామ, మండల, రాష్ట్ర స్థాయిల ఉన్న JACలనేటివి సంఘటితం కావాలె. సంఘటితమైనప్పుడే ఉద్యమనేది ఇంకొక దశకు తీసుక పోగలుగుతమనేటటువంటి ఆలోచన అందరిలో కలుగుతున్నది. అయితే సమన్వయం పెరగాలంటె మండలానికి జిల్లా స్థాయికి మధ్య ఇంకొక యూనిట్ అవసరం అనేది అందరి దగ్గరికి తీసుకెళ్ళగలగాలె. అది డివిజానా, నియోజకవర్గమా అనేది, ఒక్కొక్కచోట ఒక్కొక్క స్థాయిని ప్రజలు ఆమోదిస్తరు. ఎక్కువ వరకు నియోజక వర్గాన్ని ఒక స్థాయిగ గుర్తిస్తున్నరు. ఎందూకంటె కొత్తగ ఈ డీలిమిటేషన్‌లో ఏర్పడిన నియోజకవర్గాలనేటివి ప్రతి నియోజక వర్గంల నాలుగో అయిదో మండలాలుగా ఏర్పడి ఉన్నయి. అట్లా ఒక్కొక్క నియోజక వర్గంల జాయింట్ యాక్షన్‌కమిటీగ ఏర్పడితే జిల్లాకు నియోజక వర్గానికి సనవయం చేసుకోవడానికి వీలయితది. ఆ దిశగా ప్రయత్నం జరగాలని కూడా అనుకున్నాం. ఈ సంఘటిత నిర్మాణాన్ని పెంపొందించే దిశగానే యాత్ర కూడా చసెస్తున్నం. ఆ ప్రయత్నాలు జరుగుతున్నయి. అన్ని జిల్లాల్లో కూడా మీటింగులు పిలుస్తున్నరు. మండల శాఖలతో మాట్లడుతున్నరు. ఈ జే ఏ సీల ఏర్పాటుకోసం కూడ వాళ్ళూ ప్రయత్నాలు చేస్తున్నరు.
No comments:
Post a Comment